గిరిజన భవనాలు విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందుతాయి: మంత్రి నిరంజన్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-02-19 12:09:51.0  )
గిరిజన భవనాలు విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందుతాయి: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి: గిరిజన సంక్షేమ భవనాలు భవిష్యత్తులో విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగవరం శివారులో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన 284వ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోమ కార్యక్రమంలో పాల్గొని, గిరిజన సంప్రదాయం నృత్యాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మితమవుతున్న గిరిజన సంక్షేమ భవనాలు భవిష్యత్తులో విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందుతాయని తెలిపారు.

గిరిజనుల సమావేశాలు, సామూహిక కార్యక్రమాలకు భవనం వేదిక కానుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేశారని గుర్తుచేసారు. రాష్ట్రంలో 92.5 శాతం భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలక రైతుల చేతుల్లో ఉందన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, వ్యవసాయ కమిటీ అధ్యక్షులు రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, సంఘం జిల్లా అధ్యక్షులు జాత్రు నాయక్, జడ్పీటీసీ సామ్య నాయక్, భాగ్యలక్ష్మి, ఖిల్లా ఘానపురం ఎంపీపీ కృష్ణ నాయక్, ప్రజా ప్రతినిధులు, బీ ఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed