అధికారుల పర్యవేక్షణ లోపం.. కూలిపోయే దశకు చేరువలో ఎంపీడీవో కార్యాలయం..

by Sumithra |   ( Updated:2023-04-28 14:09:45.0  )
అధికారుల పర్యవేక్షణ లోపం.. కూలిపోయే దశకు చేరువలో ఎంపీడీవో కార్యాలయం..
X

దిశ, మిడ్జిల్ : మిడ్జిల్ మండల పరిషత్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత కొంతకాలంగా గోడలు బీటలు వారగా, శ్లాబు పై పెద్ద పెద్ద చెట్లు మొల్చడంతో స్లాబు నుండి నిరు కిందికి దిగుతుంది. ఇలాగే మరికొద్ది కాలం పాటు వదిలేస్తే ఎంపీడీవో కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు కూలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం మిడ్జిల్ మండల ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు 2004 లో కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునిక హంగులతో నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనం, 20 ఏళ్లు పూర్తిగాకముందే అధికారుల నిర్లక్ష్యానికి శిథిలావస్థకు చేరుకుంది. మిడ్జిల్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం అధికారుల నిర్లక్ష్యానికి అనతి కాలంలోనే శిథిలావస్థకు చేరుకుంది. గోడల నుండి విద్యుత్ బోర్డులోకి వర్షపునీరు చేరుకోవడంతో ఎలక్ట్రికల్ బోర్డులన్నీ ఉడిపోయాయి.

ఏ స్విచ్ ఆన్ చేయాలన్న షాక్ కొడుతుందేమో అనే భయం లో సిబ్బంది ఉన్నారు. మండల అభివృద్ధి పనులను పర్యవేక్షించే మండల ప్రజాపరిషత్ కార్యాలయనికే పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకోవడం సోచనీయం. నిత్యం కార్యాలయ నిర్వహణను పర్యవేక్షించాల్సిన మండల అభివృద్ధి అధికారి భవన నిర్వహణ తీరును పట్టించుకోకపోవడంతోనే ఎంపీడీవో కార్యాలయం గోడలు బీటలు వాడారంతో పాటు మిద్దె పై నుండి మీరు కిందికి దిగుతూ భవనం శిథిలావస్థకు చేరిందని మండల ప్రజలకు ఇస్తున్నారు. మండల ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు నిర్మించిన మండల ప్రజాపరిషత్ కార్యాలయ భవనం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పర్యవేక్షణ సరిగా చేపట్టకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుందని అధికారుల తీరు పట్ల మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎంపీడీవో కార్యాలయం పై మొలిచే చెట్లను తొలగించి, స్లాబ్ పై నిరు నిలవకుండా చేసి, బీటలు వారిన గోడలను మరమ్మతులు చేయాలని మండల ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు భవన నిర్మాణ తిరుపట్ల తమప్రవర్తన మార్చుకుంటారా లేదో వేచి చూడాలి.

Advertisement

Next Story