- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతుబట్టని వడ్లల్లో రాళ్ల బాగోతం
కల్తీ వ్యాపారాలకు అడ్డగా మారిన జడ్చర్ల
దిశ, జడ్చర్ల: మనం రోజూ బియ్యం, పప్పులో రాళ్లను చూస్తూ ఉంటాం.. ఇవన్నీ చూసిన మనం నిత్య సాధారణం అని అనుకుంటాం. కానీ జడ్చర్లలో అధికారులు అవాక్కయ్యేలా.. కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు ఓ మిల్లు యజమానులు. పట్టణంలో ఇటీవల కల్తీ కేటుగాళ్ల ఆగడాలకు అడ్డూ.. అదుపూ లేకుండా పోయింది. ఇటీవలే నకిలీ కోకోనట్ ఆయిల్, నకిలీ ఆశీర్వాద్ పైపులు, కల్తీ టీ పొడి ఇలా తరచుగా పట్టుపడుతున్న వ్యాపారుల తీరు మాత్రం మారడం లేదు. ఎవరు ఏ చేసినా.. ఏమి చేయగలరనే ధీమాతో ఇష్టానుసారంగా పూటకు ఓ చోట అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పట్టణ పరిధిలోని సత్య సాయి రైస్ మిల్లు యజమానులు కూన బాలస్వామి, యాదయ్యతమ రైస్ మిల్లులోని వరి ధాన్యం బస్తాల్లో టిప్పర్ల ద్వారా దిగుమతి చేసుకున్న చిన్న సైజు కంకర రాళ్లను కలిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్, తహసీల్దార్ పట్టణ పోలీసులు కలిసి సంయుక్తంగా శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దీంతో సంబంధిత అధికారులకు పట్టుబడ్డ 112 వరి ధాన్యం బస్తాలను స్వాధీనం చేసుకొని రైస్ మిల్లును కూడా సీజ్ చేశారు. అనంతరం, శనివారం మరో మారు అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించి మిల్లు యజమానులైన కూన బాలస్వామిని ఆరా తీయడంతో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఇలా మిక్సింగ్ చేసి ఇతర ప్రాంతాలకు లిక్కర్ ఫ్యాక్టరీలకు తీసుకెళ్తాడని తెలిపాడు. మరోవైపు అతని సోదరుడు యాదయ్య వరి ధాన్యంలో పొరపాటున రాళ్లు కలవడంతో ధాన్యం బస్తాలను పక్కకు పెట్టామని, మరల వాటిని తమ మిల్లులోని వేరు చేస్తామని పొంతన లేని సమాధామిచ్చాడు. గతంలో ఈ రైస్ మిల్ యజమానులు పీడీఎఫ్ బియ్యంతో అనేకమార్లు పట్టుబడటంతో వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ధన్యంలో ఎవరు రాళ్లను కలుపుతున్నారు.. అసలు ఎక్కడికి తరలిస్తున్నారు.. అన్న కోణంలోనే విచారణ చేపట్టారు. దీంతో అక్రమాలకు తెరలేపిన మిల్లు యజమానులైన కూన బాలస్వామి, యాదయ్యను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా రైస్ మిల్లు ప్రాంగణంలో పెద్ద మొత్తంలో వరి ధాన్యంతో పాటు కంకరరాళ్ల కుప్పలు ఉండడంతో అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు .శనివారం రైస్ మిల్లు తనిఖీలు చేసిన అధికారుల్లో విజిలెన్స్ డీ.ఎస్.వో బాలరాజు సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు లెనిన్, ఖాదర్, విజిలెన్స్ అధికారులు, తదితరులు ఉన్నారు