- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్తు పదార్థాలు సేవించే కేంద్రాలుగా టీ పాయింట్ గుడారాలు..?
దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలోని నిర్వహిస్తున్న చాయ్ హోటల్లు వివిధ రకాల పేర్లతో నూతన హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. వాటికి తోడుగా సిగరెట్లు తాగడం కోరకని ఒక్కో టీ పాయింట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మూడు నాలుగు ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గుడారాల్లోకి సిగరెట్లు తాగడానికి రోజు వందల సంఖ్యలో మైనర్లు, యువత కళాశాల స్థాయి విద్యార్థులు వస్తున్నారు. గుడారాల్లోకి వెళ్ళాక సిగరెట్ల ఉన్న పొగాకును తొలగించి తమ వద్ద తెచ్చుకున్న గంజాయి, మత్తు పదార్థాలను సిగరెట్లలో నింపుకొని సిగరెట్ మాటను గంజాయి తాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్యకాలంలో కల్వకుర్తిలో రోడ్డులో గల ఓ టీ పాయింట్ వద్ద సిగరెట్ డబ్బులు అడిగినందుకు మత్తులో ఉన్న యువకులు టీ పాయింట్ యజమానుల పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
కాగా నిత్యం ఏదో ఒకచోట గంజాయి కేసులు నమోదు కావటం వింటూనే ఉన్నాం గంజాయి సరఫరా చేస్తున్న వారినో లేక సేవిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం వంటి ఘటనలు ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో పాన్ షాప్ లో సిగరెట్ లు దొరుకుతున్నంత ఈజీగా యువతకు గంజాయి దొరుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మద్యం తర్వాత యువత ఎక్కువగా గంజాయికి ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని టీ పాయింట్ల వద్ద ఏర్పాటుచేసిన గుడారాళ్లు గంజాయి సేవించే వారికి అడ్డాలుగా మారాయి గతంలో నిర్మానుశ్య ప్రాంతాల్లోకి వెళ్లి గంజాయి, మత్తు పదార్థాలు సేవించేవారు ప్రస్తుతం ఎలాంటి రిస్క్ లేకుండా టీ పాయింట్ల వద్ద ఉన్న గుడారాల్లోనే గంజాయి మత్తు పదార్థాలు సేవించేందుకు ఉపయోగించుకుంటున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
టీ పాయింట్ల వద్ద గుడారాల ఏర్పాటుకు అనుమతులు ఎవరిచ్చారు..?
పట్టణంలోని వివిధ పేర్లతో నూతనంగా అనేక టీ పాయింట్లు వెలిశాయి . కాగా టీ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిగరెట్ తాగడానికి గుడారాలు ఏర్పాటు చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారని..? అసలు సిగరెట్లు తాగడానికి ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేయొచ్చా..? అని నిబంధనలకు విరుద్ధంగా గుడారాలు ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి ఎందుకు తొలగించడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గుడారాల ఏర్పాటుకు అనుమతులు లేవు..
జడ్చర్ల పట్టణంలోని టీ పాయింట్ల వద్ద సిగరెట్లు తాగడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారాలకు ఎలాంటి అనుమతులు లేవని అనుమతులు లేకుండా ఎవరైనా గుడారాలు ఏర్పాటు చేస్తే పరిశీలించి వాటిని తొలగిస్తామని వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ షేక్ తెలిపారు.
గంజాయి అమ్మిన.. సేవించిన.. సహకరించిన నేరమే..
గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలతో పాటు మత్తు పదార్థాలు అమ్మిన సేవించిన. సేవించే వారికి ఆశ్రయమించిన చట్టప్రకారం నేరమే అని పట్టణంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వారి పై చర్యలు చేపడతామని యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పట్టణంలో చట్ట విరుద్ధంగా ఉన్న సిగరెట్ల గుడారాలను తొలగిస్తామని జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు.