- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు: ఎమ్మెల్యే పట్నం
by Mahesh |

X
దిశ, మద్దూరు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా.. విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా మద్దూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం రూ. 84 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్ట పరుచుటకు ముఖ్యమంత్రి పాఠశాల భవనాలతో పాటు మౌలిక వసతులకు అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ , మండల పార్టీ అధ్యక్షుడు సిపిరి వెంకటయ్య , బీ అర్ యస్ సీనియర్ నాయకులు సలీం,గ్రామ సర్పంచ్ అరుణ,పీ ఏ సి యస్ అధ్యక్షులు బి జగదీశ్వర్, హాన్మి రెడ్డి, భాస్కర్ రెడ్డి,బసప్ప,ఇతర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
Next Story