కొత్తకోటలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పర్యటన

by Kalyani |
కొత్తకోటలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం పర్యటన
X

దిశ, కొత్తకోట: క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుశీల్ సింగ్ బృందం మంగళవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, సైబర్ క్రైమ్ నివారణ, మహిళల భద్రత విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు, డ్రగ్స్ వ్యాప్తికి అడ్డుకట్ట, ప్రజల్లో పోలీసుల పనితీరుపై ఉన్న అభిప్రాయం, నేరాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను ఎస్సై మంజునాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్టేషన్ లో దస్త్రాలను పరిశీలించారు. తెలంగాణ పోలీస్ పని తీరుపై మంచి అభిప్రాయం ఉందని బృందం సభ్యుడు సుశీల్ సింగ్ అన్నారు. రాష్ట్రం నుంచి 30 పోలీస్ స్టేషన్ లను అవార్డు కోసం ఎంపిక చేసారని అందులో కొత్తకోట పోలీస్ స్టేషన్ కూడా ఉందని ఎస్సై మంజునాథ్ రెడ్డి వివరించారు.

Next Story

Most Viewed