protocol issue : నర్వలో ప్రోటోకాల్ రగడ..

by Sumithra |
protocol issue : నర్వలో ప్రోటోకాల్ రగడ..
X

దిశ, నర్వ : నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నర్వప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయ ప్రారంభోత్సవం శనివారం ఉండడం.. ఆ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే శ్రీహరి హాజరవుతుండడంతో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శిలాఫలకం పై నియమాలకు విరుద్ధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరు శిలాఫలకం పై ఉండడం, ఎమ్మెల్సీ ఏవీ ఎన్ రెడ్డి పేరు లేకపోవడం పట్ల బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసి ఆందోళనకు దిగి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీ డీకే అరుణ అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పేరు శిలాఫలకం పై ఎందుకు రాయలేదు అని గట్టిగా నిలదీశారు. ఎంపీ ఎమ్మెల్యే మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఇది ఏమి సంస్కృతి అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీకే అరుణ ప్రారంభోత్సవంలో పాల్గొనకుండానే వెళ్ళిపోయారు.


Next Story

Most Viewed