- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే ఆదేశాలు అమలు కాలే..
by Kalyani |

X
దిశ, మరికల్: మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను గత నెల 22వ తేదీన స్థానిక ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి సందర్శించి బస్టాండ్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తూ బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పరిసరాలను పరిశీలించి బస్టాండ్ కాంపౌండ్ వాల్ ను తొలగించి దారులు ఏర్పాటు చేసుకోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే, 24 గంటల్లో వాటిని మూసేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
కానీ నెల రోజులు గడుస్తున్నా నేటి వరకు మూసేయకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్యే మాట కూడా ఒట్టిదేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వెంటనే బస్టాండ్ అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story