- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుర్తికొండ రామగడ్డ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
దిశ, మక్తల్: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంగళవారం కర్ణాటక రాయచూర్ జిల్లా కుర్తికొండ గ్రామంల్లో శ్రీ చోలేంద్ర శివ యోగి సంస్థాన సుక్షేత్ర రామగడ్డ జాతర ఉత్సవాలో పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు. రాయచూర్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ ఆహ్వానం మేరకు మక్తల్ ఎమ్మెల్యే హాజరు కాగా వీరికి శివయోగి సంస్థాన పీఠాధిపతి శాలువా కప్పి సన్మానించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించే తిరణాల్లో రాయచూరు జిల్లా సరిహద్దులో ఉన్న మక్తల్,గద్వాల్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతారు.మక్తల్ నియోజకవర్గంలోని శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి విరక్తి మఠం పరంపరలో ఉన్న సంస్థాన మఠం క్షేత్ర రామగడ్డ కొండపై లింగ రూపంలో ఉన్న స్వామి భక్తులకు దర్శనంమిస్తుంటారు.
సంక్రాంతి పర్వదినాలలో సుక్షేత్ర శివయోగి మఠంలో ఉత్సవాలు నిర్వహించగా మంగళవారం స్వామి వారికి మకర సంక్రమణ తెల్లవారుజామున క్రిష్ణా నది జలాలతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు పాల్గొంటారు.అందుకు కర్ణాటక రాయచూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, రవికుమార్, రాజప్ప గౌడ్, ఆనంద్ గౌడ్, నాగేశ్వర్ రావు, వాకిటి నారాయణ, గంగాధర్ గౌడ్, తమ్మప్ప, నాగేందర్,లక్ష్మీనారాయణ గౌడ్, క్రిష్ణమూర్తి, రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.