ఏమి చిట్టా తెచ్చినవ్ ఎంకన్న – కేటీఆర్​

by Kalyani |   ( Updated:2023-09-11 10:28:47.0  )
ఏమి చిట్టా తెచ్చినవ్ ఎంకన్న – కేటీఆర్​
X

దిశ, దేవరకద్ర: ఏమి చిట్టా పట్టుకొచ్చినవ్ వెంకన్న అంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తనను కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీ ఉద్దేశించి అన్నారు. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , ఇతర మంత్రులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎక్కువసార్లు కలుస్తూ ఉంటారని మంత్రి కేటీఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారు.

ఈ క్రమంలో సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఒక చేతిలో పూల మొక్క, మరో చేతిలో వినతి పత్రం తో ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆల ను చూడగానే మంత్రి కేటీఆర్ నవ్వుతూ మళ్లీ ఏం చిట్టా తెచ్చావు ఎంకన్న అని అడగడంతో.. భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీలలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని మీకు తెలియజేసేందుకు వచ్చాను అన్న అని ఆల బదులు ఇచ్చినట్లు అక్కడ ఉన్న వారి ద్వారా సమాచారం అందింది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed