పొందిన జ్ఞానంతో అద్భుతాలు సృష్టించాలి- Minister Niranjan Reddy

by Kalyani |   ( Updated:2023-08-23 14:38:17.0  )
పొందిన జ్ఞానంతో అద్భుతాలు సృష్టించాలి- Minister Niranjan Reddy
X

దిశ,వనపర్తి : శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని పదిమందికి పంచి అద్భుతాలు సృష్టించేలా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పండ్ల తోటల నర్సరీల పెంపకంపై మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న, మోజర్ల కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం కళాశాల విద్యార్థులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సర్టిఫికెట్ల ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మూడు నెలలలో మీరు పొందిన పరిజ్ఞానాన్ని ప్రభుత్వ, ప్రైవేటు అన్న ఆలోచన లేకుండా భిన్నరంగాలలో రాణించాలనీ,రైతులలో జ్ఞానాన్ని పెంపొందించి వ్యవసాయంలో, వ్యవసాయ అనుబంధ రంగాలలో అద్భుతాలు సృష్టించేలా,వ్యవసాయ భూములు ఉన్న విద్యార్థులు విభిన్న రకాల పంటలు సాగు చేసేలా వ్యవసాయం మీద దృష్టి సారించలన్నారు.ఈ కార్యక్రమం లో వీసీ నీరజా ప్రభాకర్,డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ అడప కిరణ్ కుమార్,అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story