రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి

by Naveena |
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి
X

దిశ, ఊట్కూర్ : మక్తల్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఇందులో భాగంగా మంత్రి మండల పరిధి పులిమామిడి గ్రామంలోని గుట్ట పైన ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పులిమామిడి గ్రామంలోని సమస్యలతో పాటు స్వామివారి దేవాలయానికి రోడ్ వ్యవస్థను కల్పించాలని మంత్రి ఎమ్మెల్యే విన్నవించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పులిమామిడి గ్రామ సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా 10 లక్షల రూపాయలను విడుదల అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అన్ని అర్హతలు ఉన్న పులిమామిడి గ్రామంను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, బికేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు విగ్నేశ్వర్ రెడ్డి పులిమామిడి గ్రామ మాజీ సర్పంచ్ సూరయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు లింగం, మోహన్ రెడ్డి, శంకర్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed