- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదవ కార్పొరేషన్ సాధించే వరకూ పోరాటం ఆగదు..
దిశ, అచ్చంపేట: గొల్ల కురుమ యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఆర్అండ్ బిగెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 శాతం ఉన్న గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి ప్రతి బడ్జెట్‌లో 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కోటి జనాభా ఉన్న దేశంలో.. 60 లక్షల ఓటర్లుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు అత్యధిక సీట్లు కేటాయించాలని అన్నారు. 1955 నుంచి 1970 వరకు ఉన్న 10 శాతం ఎస్ఎన్‌టీ రిజర్వేషన్( అర్థ సంచార జాతి) అప్పటి ప్రభుత్వాలు రద్దు చేయగా.. వాటిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. దాంతో 10 శాతం ఎస్ఎన్‌టీ రిజర్వేషన్ ఎంతో మంది చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని స్పష్టం చేశారు. గొల్ల కురుమల డిమాండ్‌లను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అక్కడ నుంచే ప్రారంభం..
కొండగట్టు నుంచి మొదలైన పాదయాత్ర ప్రస్తుతం జగిత్యాల జిల్లా వరకు చేరుకుందని, త్వరలోనే నాగర్ కర్నూల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే వచ్చే 2024 ఎలక్షన్‌లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి యాదవ ఐక్యతను చాటుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రాలో ప్రత్యేక పోరాటం నిర్వహించి కార్పొరేషన్ సాధించామని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా కార్పొరేషన్ సాధించే వరకు పోరాటం ఆగేది లేదని అన్నారు.
శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించకపోతే అసెంబ్లీ సమావేశం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుందేళ్ళ శంకర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఇడ ముని మల్లేష్ యాదవ్, అలంపూర్ జిల్లా అధ్యక్షులు అమర్ యాదవ్, ఉప్పునుంతల మండల అధ్యక్షులు దుడ్డు శ్రీను యాదవ్, బల్మూర్ మండల అధ్యక్షుడు వావిల్ల విష్ణు వర్ధన్ యాదవ్, ఆయా గ్రామాల అధ్యక్షులు, ఆయా మండల గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read More....