ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: ఐఎఫ్టీయూ

by Kalyani |   ( Updated:2023-05-01 15:36:51.0  )
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: ఐఎఫ్టీయూ
X

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదామని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. వెంకటేష్ అన్నారు. మే డే సందర్భంగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సోమవారం న్యూ గంజ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం అక్కడ జరిగిన ధర్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, ఎయిర్ పోర్టులు, షిపులు తదితర సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టి, కోట్లాది రూపాయల రాయితీలను ఇస్తుందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు సంఘం నాయకులు నర్సింహులు, దాసు, శేఖర్, చెన్నయ్య, సతీష్, వెంకట్రాములు, హమాలీ సంఘం నాయకులు వెంకటయ్య, నర్సింహులు, నితీష్, రాఘవులు, మన్నెమ్మ, చంద్రకళ, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story