రాహుల్ గాంధీపై వేటు అన్యాయం: ములుగు ఎమ్మెల్యే సీతక్క

by Kalyani |
రాహుల్ గాంధీపై వేటు అన్యాయం: ములుగు ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, మరికల్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అన్నదాత వేటు వేయడం అన్యాయమని మోడీ ప్రభుత్వం దురాహంకారానికి, నియంత పోవడానికి నిదర్శనమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకి వెళుతూ మార్గమధ్యలో మరికల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక విపక్ష నేతలపై ప్రతీకారం చర్యలకు పాల్పడుతున్నదని అందులో భాగంగానే రాహుల్ గాంధీ పై వేటు వేయడం జరిగిందని మండిపడ్డారు.

పార్టీల మధ్య ఉండే వైరుద్యాలకు ఇది సందర్భం కాదని రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్ ను తమ హేయమైన చర్యలకు వినియోగించుకోవడం అన్యాయమన్నారు. చేయి చేయి కలిపి నడుద్దాం కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెలగొంది వీరన్న,రాఘవేందర్, మల్లేష్, హరీష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story