Former minister Singireddy : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి..

by Sumithra |
Former minister Singireddy : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి..
X

దిశ, పెబ్బేర్ : పెబ్బేరు మండలంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పనులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో గజ్వేల్ తర్వాత కేసీఆర్ ని ఒప్పించి తన హయాంలో పాతపల్లీలో 50, గుమ్మడంలో 100 డబుల్ బెడ్ ఇండ్లను మంజూరి చేయించినానని అన్నారు.

అందులో భాగంగా గుమ్ముడం 100 ఇండ్లకు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయించి కాంట్రాక్టర్ వెంటపడి పూర్తి చేయించామన్నారు. చిన్న చిన్న మైనర్ పనులు మిగిలిపోయిన దశలో ఉన్నాయని, అదేవిధంగా పాతపల్లి గ్రామంలో 50 ఇండ్లను నిధులు మంజూరు ఇచ్చి స్లాబ్ వరకు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ ఎద్దుల.కరుణ శ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి, గోపి, దిలీప్ కుమార్ రెడ్డి, మేకల ఎల్లయ్య, సాయినాథ్, విశ్వ రూపం, ఈశ్వర్, రమేష్ తదితరులు పాల్గోన్నారు.

Next Story