నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద అగ్ని ప్రమాదం..

by Kalyani |
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద అగ్ని ప్రమాదం..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది. కార్యాలయం ఎదుట ఉన్న టీ స్టాల్ యాజమానులు తాగి పడేసిన టీ గ్లాసులను ట్రాన్స్ ఫార్మర్ పక్కనే వేసి నిప్పు పెట్టడంతో పాటు అధిక ఉష్ణోగ్రత కారణంగా ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ కార్యాలయ పరిసరాలు పరిశుభ్రత తాగునీటి అవసరాలను తీర్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Advertisement

Next Story