- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > అందరి జీవితాలు కూడా అన్ని రంగుల లాగే అందంగా కావాలి : గద్వాల ఎమ్మెల్యే
అందరి జీవితాలు కూడా అన్ని రంగుల లాగే అందంగా కావాలి : గద్వాల ఎమ్మెల్యే
by Aamani |

X
దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ పండుగ వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరి జీవితాలు కూడా అన్ని రంగులలాగే అందంగా రంగులమయం కావాలని కోరుకుంటున్నానని, నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే రంగులు పూస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు టి గోవిందు, నెమలి కంటి ధర్మారాయుడు, రాజు, వీరేష్ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
Next Story