- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Minister : ఆరు గ్యారంటీల అమలుతో అభివృద్ధి కనబడుతుంది
దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: గత పది సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆరు గ్యారంటీల అమలుతో అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. నిరంకుశ పాలన నిర్మూలన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అమలుకు శ్రీకారం చుట్టి, ప్రజల వద్దకు పాలన, ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో సుందరమైన పర్యాటక క్షేత్రాలు అనేకం ఉన్నాయని, నెలకు ఒక్కసారైనా సందర్శించాలని ఆయన సూచించారు. రాబోయే కాలంలో ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అధికారులు, సిబ్బంది వాటిని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. అంతకుముందు స్థానిక ఆర్ అండ్ బి చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జీ.మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చైర్మన్ బెక్కరి అనిత, తదితర అధికారులు పాల్గొన్నారు.