- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వరాష్ట్రంలోనే పల్లెలు అభివృద్ధి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దిశ, జడ్చర్ల: తెలంగాణ వచ్చాకే గ్రామాలు అభివృద్ధి చెందాయని, పచ్చదనం పరిశుభ్రత మెరుగు అయిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో పర్యటన సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, యాదవ కమ్యూనిటీ హాల్ లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో పర్యటిస్తూ గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. 2014 కు ముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం ఎలా ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు.
నేడు రాష్ట్రంలోని ప్రతి పల్లెలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కేటాయించడంతో పల్లెలు పచ్చదనం, పారిశుద్ధ్యంతో విరాజిల్లుతున్నాయని చెప్పారు. కేంద్రం సైతం తెలంగాణ పల్లెలు మెచ్చి జాతీయస్థాయిలో అవార్డులు అందజేసిందని గుర్తు చేశారు. జాతీయస్థాయిలో అవార్డులు రావడమే మన పల్లెలు మెరుగుపడ్డాయని చెప్పడానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య , రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్ తదితరులు పాల్గొన్నారు.