ప్రజావాణి కార్యక్రమం రద్దు.. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

by Javid Pasha |   ( Updated:2022-12-17 14:55:30.0  )
ప్రజావాణి కార్యక్రమం రద్దు.. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
X

దిశ, వనపర్తి: ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వివిధ శాఖల మంత్రులు ఈ నెల 19న జిల్లాకు వస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. 19వ తేదీన జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story