నేడు మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Anjali |   ( Updated:2024-04-19 03:22:14.0  )
TPCC President Revanth Reddy Alleged CM KCR of Destroying The Education System In The State
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. మొదటిరోజు ఎంపీ స్థానానికి పులువురు నేతలు నామినేషన్లు వేయగా.. రెండో రోజు నామినేషన్ల జోరు మరింతగా పెరిగింది. నేడు కాంగ్రెస్ అభ్యర్థి మహహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నామినేషన్ అనంతరం రేవంత్‌ రెడ్డి కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ రోజే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పొరిక బలరామ్ నాయక్ నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరు కానుండటంతో అభ్యర్థులు భారీగా జనసమీకరణకు ప్లాన్ చేసుకున్నారు.

Next Story