ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

by Kalyani |   ( Updated:2024-09-15 09:24:57.0  )
ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, చిన్న చింతకుంట: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్), ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ తండ్రి కృష్ణారెడ్డి దివంగతులు అయిన నేపథ్యంలో నిర్వహించిన 12 రోజుల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలం, దమగ్నాపూర్ లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఈ సందర్భంగా జీ .కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.దాదాపుగా నలభై ఐదు నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిఎంఆర్ కుటుంబ సభ్యులతో గడిపారు.


రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి . చిన్నారెడ్డి , నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్. మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చందు రెడ్డి, శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేఘా రెడ్డి ,డాక్టర్ వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, చిట్టెం పర్ణిక రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, కూచకుళ్ల రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ,పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




Advertisement

Next Story

Most Viewed