- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ దే అధికారం అని డికె అరుణ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం గొప్ప విజయమని,ఈ విజయం దేశవ్యాప్తంగా పండుగలా చేసుకుంటున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ అవినీతి అక్రమాలను పరాకాష్ట ఆయన పరాజయానికి నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఢిల్లీ ప్రజలు విశ్వసించి గొప్ప విజయాన్ని అందించారని,ఈ సందర్భంగా వారికి ఆమె అభినందనలు తెలిపారు. ఆరు గ్యారంటీ లంటూ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని,కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు జనరంజకమైన బడ్జెట్ ను నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని,ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ బడ్జెట్ గొప్ప వరమని,ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన జడ్పీటీసీ,ఎంపిటీసీ,సర్పంచ్,మున్సిపల్ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే నని,రాష్ట్ర అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని ఆమె అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో బీజేపీ హావా మొదలైందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.