- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్మి మోసపోయాం.. ఆదరించి ఆదుకోండి..!
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఫైనాన్స్ పేరుతో చిట్టీల వ్యాపారం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఫైనాన్స్ వ్యాపారి సాయిబాబు నుంచి తమ డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ ఆయా గ్రామాల బాధితులు నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులను మరోసారి వేడుకున్నారు. శనివారం వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఆయా గ్రామాల నుంచి వందల మంది బాధితులు వారు కట్టిన డబ్బుల ఆధారాలను బాండ్ పేపర్లను పోలీసులకు అందజేశారు. గత నెలలో జిల్లా ఎస్పీ మనోహర్ ని కలిసి ఫిర్యాదు చేయగా పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డీఎస్పీ మోహన్ కుమార్ ను ఆదేశించారు. కాగా కేసు నమోదు చేసి స్పెషల్ టీం ద్వారా మోసగాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
అయితే ఒక్కొక్కరూ ఎంత డబ్బు చెల్లించారో తెలుసుకోవడం కోసం బాధితుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. ఎలాగైనా సాయిబాబు అనే వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించి తమను ఆదుకోవాలని బాధితులు మొరపెట్టుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు చిట్టి వ్యాపారం చేసి మోసగించిన సాయిబాబును రక్షించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుపుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇంతమంది బాధితులు నష్టపోయి రోడ్డున పడి ఇబ్బంది పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.