- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
by Kalyani |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్పీ జానకి లు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిలిపే ప్రాంతాన్ని, అనంతరం రాష్ట్ర మంత్రులతో పాటుగా, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతో కలిసి ఉమ్మడి జిల్లా కు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించే సమావేశ మందిరాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే పలు అంశాలు,ఏర్పాట్లపైన పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడి నర్సింహులు, డిపిఆర్ఓ శ్రీనివాసులు, డిఎఫ్ఓ సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story