- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దిశ, గద్వాల కలెక్టరేట్ : చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరూ ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని అక్షయ గ్రాండ్ హోటల్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...సంప్రదాయ కుల వృత్తులను లాభదాయకంగా మార్చడం, కులవృత్తి, చేతివృత్తిదారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 18 కేటగిరీలలో పని చేస్తున్న చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారికి ఈ పథకంలో ఆర్థిక సాయం అందిస్తారన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం 5రోజుల పాటు నైపుణ్యంలో అడ్వాన్సు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందన్నారు. లబ్ధిదారులకు 5 శాతం వడ్డీతో
రూ. 3లక్షల వరకు రుణ సహాయం అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు తమ వివరాలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, రేషన్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలతో డాక్యుమెంట్లు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ ఫోన్ నంబర్ జత చేసి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలన్నారు. పీ.ఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని విశ్వకర్మలు తయారుచేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా ఎం.ఎస్.ఎం.ఈ కృషి చేస్తుందని అన్నారు.
ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకుని ఉన్న పీ.ఎం విశ్వకర్మ పథకం గురించి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి యాదగిరి , ఎం.ఎస్.ఎం.ఈ సహాయ సంచాలకులు బి. శ్రీధర్ , మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్ , డి.ఆర్.డి.ఓ. పి.డి నరసింగ రావు, డి.ఎల్.పి.ఓ వెంకట్ రెడ్డి, ఎల్డీఎం అయ్యపు రెడ్డి, పీఎం విశ్వకర్మ యోజన జిల్లా కో-ఒర్దినటర్ శేఖర్, సంబంధిత 18 రకాల చేతి వృత్తిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Read More..