- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Absconded : అధిక వడ్డీ ఆశ చూపి 30 కోట్లతో పరార్.!
దిశ, నాగర్ కర్నూల్ : రేవల్లి మండలం నాగపూర్ వడ్డీ వ్యాపారి సాయిబాబా ఘరానా మోసం మరువక ముందే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో మరో ఘరానా మోసగాడి ఉదంతం వెలుగు చూసింది. అధిక వడ్డీ ఆశ చూపి అమాయకుల నెత్తి పై కుచ్చుటోపి పెట్టి పరారైన బాగోతం మరొకటి వెలుగు చూసింది. అయితే ఈ సంఘటనలో బంధువుల బంధుప్రీతి ఆసరాగా ఈ మోసానికి పాల్పడడం గమనార్హం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు 30 కోట్లు వసూలు చేసుకుని గుట్టుగా జారుకున్న మోసగాడి పై సోమవారం బాధితులు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మోసపోయిన బాధితులు మాట్లాడుతూ.. తెలకపల్లి మండలం నడిగడ్డకు చెందిన జహీర్ చోటేమియా అనే వడ్డీ వ్యాపారి తన సమీప బంధువులతో నాగర్ కర్నూల్, తెలకపల్లి, నడిగడ్డ, తూడుకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుంచి 30 కోట్ల మేర అధిక వడ్డీ కింద డబ్బులు చాకచక్యంగా వసూలు చేసుకున్నాడు.
మొదట 2, 3, 5 లక్షల వరకు అతనితో భద్రపరచుకొని వడ్డీతో సహా తీసుకొని వెళ్లేవారు. అందరినీ నమ్మించడంతో ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షల వరకు అతనితో దాచుకున్నారు. కొంత కాలం పాటు మిత్తితో పాటు కొంత అసలు కూడా ఇచ్చారు. అయితే గత ఆరు నెలల నుంచి అసలు కాదు కదా మిత్తి డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విషయంలో బాధితులు పెద్దమనుషుల సమక్షంలో కూడా పలు పర్యాయాలు కూర్చొని పంచాయతీ పెట్టారు. ఒకరిద్దరి బాధితులకు పెద్ద మనుషులతో మాట్లాడి కొంత డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఏం చేస్తారో చేసుకోమంటూ ప్లేట్ మార్చాడు.
జహీర్ అలియాస్ చోటే మేము కిడ్నాప్ చేసింది ఎవరు..? అని మోసపోయిన బాధితులు ప్రశ్నిస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నాడు..? పరారీలో ఉన్నాడా..? దాక్కున్నాడా..? మాకు న్యాయం ఎవరు చేస్తారంటూ మీడియాతో వాపోతున్నారు. బాధితులు లబోదిబోమంటూ సోమవారం సుమారు 30 మంది బాధితులు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. జహిర్ చోటేమియా నుండి తమకు డబ్బులు ఇప్పించాలని ఫిర్యాదులో న్యాయం చెయ్యాలని పేర్కొన్నారు. లేదంటే చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు.