సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు

by Naveena |
సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రభుత్వ చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం విప్లవాత్మక మార్పు అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వీరన్నపేట,బండ్లగేరి లోని కిసాన్ నగర్ చౌకధర దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పేదలు,ధనికులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటేనని భావంతో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తున్న అన్ని సరుకుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎత్తివేసి దొడ్డు బియ్యం మాత్రమే పంపిణీ చేసి పేదల పట్ల పక్షపాత వైఖరి ధోరణి అవలంబించి ఉందని ఆయన విమర్శించారు. ఈ సంవత్సరం మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉందని,25 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు,పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో,ప్రభుత్వ హాస్టళ్ళలో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 506 చౌకధర దుకాణాల ద్వారా కొత్తగా మంజూరు చేసిన కార్డులను కలుపుకుని,2,44,678 మంది కార్డుదారులకు 5228 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 13 వేల కొత్త కార్డులు మంజూరు చేసినట్లు,ఇకపై అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. పోషక విలువలు గల సన్న బియ్యం పంపిణీ పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ అనిత,డిసీఎస్ఓ వెంకటేష్,పౌర సరఫరాల సంస్థ డిఎం రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story