గోమాతకు అంతిమ వీడ్కోలు..ఘనంగా అంత్యక్రియలు

by Kalyani |
గోమాతకు అంతిమ వీడ్కోలు..ఘనంగా అంత్యక్రియలు
X

దిశ, అలంపూర్ : గోమాతకు అంతిమ వీడ్కోలు పలికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేపట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో చోటుచేసుకుంది. మానవపాడు మండల కేంద్రంలో పరమేశ్వరుని ఆలయానికి దేవుని ఆవుగా భావించి ఓ గోమాతను చిన్నప్పుడే వదిలారు. శనివారం తెల్లవారుజామున ఆ గోమాత అనారోగ్యం వల్ల మృతి చెందింది. సంప్రదాయ బద్ధంగా బాజా భజంత్రీల మధ్య గోమాత ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నప్పుడే ఆవును వదిలిన యజమానితో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దుల బండి పై హిందూ స్మశాన వాటిక వరకు తీసుకెళ్లి జేసీబీ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతకు దశదినకర్మలు నిర్వహించి బంధుమిత్రులకు దిన భోజనాలు ఏర్పాటు చేస్తామని యజమాని కురువ యోగేశ్వర్-శకుంతల చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed