- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు : MLA Shailendra Beldale
X
దిశ, జహీరాబాద్: కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన రాష్ట్రాన్ని తాగుబోతు తెలంగాణగా తయారు చేస్తోందని బీదర్ సౌత్ ఎమ్మెల్యే డాక్టర్. శైలేంద్ర బెళదలే ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టం కావాలని, శక్తి కేంద్ర ఇన్‌చార్జ్ బూత్ లలో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మండల కమిటీ నాయకులు మండలాలలో ప్రజల సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. జహీరాబాద్ లో బీజేపీ గెలుపు కోసం ఎల్లవేళలా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రాజ నర్సింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్, సుధీర్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సుధీర్ బండారి, శ్రీనివాస్ గుప్తా, అడివి అన్న, ఏక్ నాథ్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story