- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
RSP : హెలికాప్టర్ ఖర్చులతో పేద బిడ్డలకు ల్యాప్ టాప్ ఇవ్వొచ్చు : ఆర్ఎస్పీ

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది గౌలిదొడ్డి(బాయ్స్) గురుకులం(Gurukula)లో చదువుతూ ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ల్యాప్‌టాప్స్(Laptops)అందించేవారని.. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు విద్యార్థులకు ల్యాప్‌టాప్స్ అందలేదని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. గొప్ప చదువులు చదవాలనుకునే గురుకుల విద్యార్థులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ల్యాప్‌టాప్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురుకుల విద్యార్థులు ఆర్ఎస్పీకి మేసేజ్ చేశారు. ఈ మేసేజ్‌పై ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. కాంగ్రెస్ మంత్రులు హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు హెలికాప్టర్‌లో పోయిన ఖర్చుతో ఈ పేద బిడ్డలకు మంచి ల్యాప్‌టాప్స్ పంపిణీ చేయవచ్చని.. రూ.32 వేల ప్లేటు మీల్స్ గురించి నేను మాట్లాడనని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చురకలంటించారు. ఇటీవల పట్టుమని కారుతో రోడ్డు మార్గంలో కాన్వాయ్ లో వెళితే గంట ప్రయాణానికి కూడా మంత్రులు హెలికాప్టర్ వాడుతుండటంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.