- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ దాదాపు ఖరారు?
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడుతో పాటు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ సెగ్మెంట్లకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగడంతో పాటు అదే రోజు తుది ఫలితాలు వెలువడనున్నా్యి. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల కానుంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకుండా ఇప్పటివరకు వ్యూహాత్మకంగా వ్యహరించింది. ఈ క్రమంలో అనూహ్యంగా ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏ క్షణమైనా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మునుగోడులో ఒకసారి టీఆర్ఎస్ జెండా ఎగరేసి, గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే టీఆర్ఎస్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కూసుకుంట్లకు నియోజకవర్గం మీద మంచి పట్టు ఉండటంతో ఆయన అభ్యర్థిత్వాన్నే గులాబీ బాస్ ఫైనల్ చేసే చాన్సులు ఉన్నట్లు సమాచారం. దీనిపై టీఆర్ఎస్ నాయకత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.