ఈ కంపెనీ మాకొద్దు.. నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు

by Sumithra |
ఈ కంపెనీ మాకొద్దు.. నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు
X

దిశ,చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఇటీవల నూతన కంపెనీ "ఎమ్మెస్ ఫ్యాక్ టిక్" అనే కంపెనీ నిర్మాణ పనులను చందంపేట గ్రామ ప్రజలు అడ్డుకున్నది విదితమే. మంగళవారం జేసీబీతో పనులు ప్రారంభించగా, ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు నిర్మాణం చేపడుతున్న కంపెనీ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇప్పటికే మా గ్రామంలో రసాయన కంపెనీతో ఇబ్బందులు పడుతున్నామని, మరొక కంపెనీ చేపడితే, గ్రామం వల్లకాడవుతుందని పేర్కొన్నారు. నూతన కంపెనీ గ్రామానికి 300 మీటర్ల దూరంలో ఉందని, ఇప్పటికే కాలుష్యంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో బోరు నీళ్లు కలుషితం వంటి సమస్యలతో వెల్లదీస్తున్నామని, సంబంధిత అధికారులు స్పందించి కంపెనీ నిర్మాణ పనులు అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed