- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి
by GSrikanth |

X
దిశ, బీబీనగర్: పార్టీ మార్పు వార్తలపై డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని, తానే గెలవబోతున్నానని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. రానున్న ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేల్లో వస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు మీడియాకు లీకులు ఇస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనెల 16 నుండి భువనగిరిలో నిర్వహించే హాత్ సే హాత్ జొడో పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.
Next Story