- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చేసిన చెరగని సంతకం ఇదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అని కేటీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రేపు ప్రారంభమవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేసీఆర్ సుదీర్ఘ దృష్టికి, భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అనితరసాధ్యమైన వేగానికి మరొక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం వెనక ఉన్న కేసీఆర్ దార్శనికత, కృషి తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని ఆయన చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా తీర్చిదిద్దారంటే అది కేసీఆర్ దార్శనికతే అని పేర్కొన్నారు.
2014లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేవలం 7778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం మాత్రమే కలిగి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20,000 మెగావాట్ల సామర్ధ్యాన్ని చేరుకొనేలా చేసిందని కేటీఆర్ వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం BHEL కంపెనీకి అప్పగించిందని , దాదాపు రూ.20,400 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చామని ఆయన అన్నారు. భారత దేశ విద్యుత్ రంగ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వబడిన అత్యంత విలువైన ఆర్డర్‌గా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు (5x800) అని చెప్పారు. ఈ పవర్ ప్లాంట్ దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విజయగాథ అని, ఇదీ కేసీఆర్ ఆనవాళ్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.