- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దామగుండం నౌకాదళ రాడార్‌పై KTR ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: దామగుండంలో కేంద్రం నెలకొల్పుతున్న నౌకాదళ రాడార్ అంశంపై మంగళవారం ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘3000 ఎకరాల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న 12 లక్షల చెట్లను నరికివేయడంతో మూసీ నది పుట్టే ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడం తప్పు. 10ఏళ్లకు పైగా దీన్ని తమ ప్రభుత్వం ప్రతిఘటించింది. తెలంగాణ కొత్త ప్రభుత్వం పరిణామాల గురించి ఆలోచించకుండా 10 రోజుల్లేనే కేంద్రానికి లొంగిపోయింది. తెలంగాణ భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి.’ అని ట్వీట్ చేశారు.
ఇక ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోడ్డు నిర్మాణ సమయంలో 7,800 ఎకరాల్లో అడవిలోని 22-25 లక్షల చెట్లను నరికివేసినప్పుడు మీరేందుకు మౌనంగా ఉన్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘హరిత హారం పేరు మీద మన సాంప్రదాయ మొక్కలను తీసేసి రోడ్డుకి ఇరువైపులా వేరే దేశం వాళ్లు నిషేధించిన విషపూరిత మొక్కలను నాటారు.. మీరు దీని గురంచి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని మరో నెటిజన్ మండిపడ్డాడు. ‘సిటీ మొత్తం విషపు మొక్కలు నాటి సొల్లు కబుర్లు చెప్తున్నాడు.’ ‘తెలంగాణలో లిక్కర్ నదిని పారించి జనాల్ని మందుబాబుల్ని చేసి లిక్కర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ట్విట్టర్ టిల్లు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారా భయ్యా..’ అంటూ నెటిజన్లు వరుస ట్వీట్లతో కేటీఆర్ పై విరుచుకుపడుతున్నారు.