- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ప్రజలకు KTR సంచలన పిలుపు
దిశ, బెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పిలపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపించారు. ఈ జనవరి నెల నుంచి ఎవరూ కరెంట్ బిల్లులు కట్టొద్దని సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చే వరకూ బిల్లులు కట్టొద్దని చెప్పారు. ఒకవేళ అధికారులు బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తే.. ముఖ్యమంత్రి మాటలను చూపించాలని అన్నారు.
సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పిండని గుర్తుచేశారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని అడిగారు. అంతేకాదు.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి చూస్తే కాంగ్రెస్‌ను వదిలిపెట్టే పరిస్థితే లేదని వార్నింగ్ ఇచ్చారు.
Read More: లండన్ వేదికగా కేసీఆర్‌పై CM రేవంత్ ఫైర్.. బీఆర్ఎస్ రియాక్షన్ ఇదే!