తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, పొత్తులపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఇక నుంచి తమ పార్టీపై ఎవరైనా సోషల్ మీడియా వేదికగా కానీ, మరే వేదిక మీద నుంచైనా అసత్య ప్రచారం చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 23 ఏళ్లుగా అనేక కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కొంటూ వస్తోందని అన్నారు. అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుదాం అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎప్పటికీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు.

Advertisement

Next Story