హిమాన్షు డ్రోన్ ‘షో’.. దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలో KTR తనయుడి మార్క్..!

by Satheesh |   ( Updated:2023-06-24 07:11:34.0  )
హిమాన్షు డ్రోన్ ‘షో’.. దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలో KTR తనయుడి మార్క్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు డ్రోన్స్ షో చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు ముగింపు రోజున అమరవీరుల స్మారక జ్యోతి ఆవిష్కరణ కార్యక్రమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఐఐటి ఢిల్లీ స్టార్టప్ ద్వారా డోన్లతో 13 నిర్మాణాలపై లేజర్లతో షో నిర్వహించారు.

15 నిమిషాల పాటు సాగిన ఈ డ్రోన్ షో ఆహుతలను ఆకట్టుకుంది. ఈ డ్రోన్ షో వెనకాల హిమాన్షు కీలక భూమిక పోషించారు. డ్రోన్ షో నిర్వహించేందుకు వచ్చిన బృందానికి ఆతిథ్యం మొదలు ముగింపు వరకు వారికి పూర్తి సహకారం అందించారు. ఈ డ్రోన్ షోకు ప్లాన్ చేసింది మంత్రి కేటీఆర్ అని సమాచారం.

అమరవీరుల స్మారకం జ్యోతి ఆవిష్కరణను కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఇందులో డ్రోన్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఒకే సమయంలో 750 డ్రోన్లతో 15 నిమిషాల పాటు ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణలోని 13 అభివృద్ధి చిహ్నాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఢిల్లీలోని ఐఐటి స్టార్టప్ ద్వారా డ్రోన్ల ప్రదర్శన నిర్వహించారు.

చార్మినార్‌తో కూడిన కాకతీయ తోరణం, (తెలంగాణ రాజముద్ర) బతుకమ్మ, పాలపిట్ట, పిడికెలెత్తిన కేసీఆర్, కాళేశ్వరం, టీహబ్, పది జిల్లాల నుంచి 33 జిల్లాలుగా అవతరణ, కృష్ణా, గోదావరి ప్రవాహం, సచివాలయం, గన్ పార్కులోని అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరజ్యోతిలను ఒకే సమయంలో డ్రోన్ల లేజర్ లైట్‌లతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన చేయడానికి మంత్రి కేటీఆర్ ప్లానని సమాచారం.

అయితే ఇందులో కీలక భూమిక పోషించింది మాత్రం కేటీఆర్ తనయుడు హిమాన్షు. యానిమేషన్లో హిమాన్షు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. యానిమేషన్‌పై ఉన్న ఆసక్తితోనే హిమాన్షు డ్రోన్ షోలో అన్ని తానే వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ ఐఐటి బృందానికి అకామిడేషన్ మొదలు డ్రోన్ షో కంప్లీట్ అయ్యేవరకు వారికి సహాయ సహకారాలు అందించారు. ఒకేసారి 750 డ్రోన్లతో లేజర్ షో నిర్వహించి సక్సెస్ చేయడంతో హిమాన్షు పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.

తెలంగాణలో ఇది రెండో షో

తెలంగాణ రాష్ట్రంలో డ్రోన్లతో నిర్వహించిన రెండో షో ఇది. ఇంతకుముందు హైదరాబాద్ తీగల వంతెన వద్ద డ్రోన్ షో నిర్వహించారు. ఇక అమరవీరుల స్తూపం వద్ద జరిగిన డ్రోన్ షో ఆకట్టుకుంది. ఒకే సమయంలో 750 డ్రోన్లు గాలిలో ఉండి 13 నిర్మాణాలపై 15 నిమిషాల ప్రదర్శన నిర్వహించారు.

షోకు కోటిన్నర..

డ్రోన్‌లతో నిర్వహించిన లెజర్ షోకు సుమారు కోటిన్నర పైగా ఖర్చు అయినట్లు సమాచారం. అయినప్పటికీ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన ఈ షోతో ప్రభుత్వానికి మైలేజ్ వచ్చిందని.. ప్రజలను సైతం ఆకట్టుకుందని టాక్. ఇలాంటి షోను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని ప్రజలకు తెలంగాణ అభివృద్ధిని వివరించేందుకు దోహదపడుతుందని భావిస్తూ భవిష్యత్తులో మరిన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Next Story

Most Viewed