జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దాం అని కేటీఆర్ ప్రపోజల్.. CM రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్ ఇదే..!

by Rajesh |
జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దాం అని కేటీఆర్ ప్రపోజల్.. CM రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామన్నారు. ఏకతాటిపైకి వచ్చి పోరాడదామని కేటీఆర్ అన్నారు. కేంద్ర మంత్రులు నిధులు తెస్తారో.. రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని తెలిపారు. ఈ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి బదులిస్తూ.. ఢిల్లీలో దీక్ష చేసేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వస్తే.. ఢిల్లీలో దీక్ష చేసేందుకు తాను సిద్ధమన్నారు. కేసీఆర్ వస్తే.. జంతర్ మంతర్ వద్ద తానూ దీక్షలో కూర్చుంటా అన్నారు. రాష్ట్రానికి నిధులు కోసమైనా కేసీఆర్ దీక్షకు ముందుకు రావాలని సీఎం రేవంత్ కోరారు. పాలక పక్ష నేతగా తాను వస్తా అని.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలని రేవంత్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా తాను సిద్ధమన్నారు. సచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుకునుడో జరగాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed