ఉప ఎన్నికల్లో దానం నాగేందర్‌ను ఓడిస్తాం.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

by Shiva |   ( Updated:2024-09-09 11:48:13.0  )
ఉప ఎన్నికల్లో దానం నాగేందర్‌ను ఓడిస్తాం.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు మరో నాలుగు వారాల్లోగా సదరు ఎమ్మెల్యేలపై అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ధర్మాసనం తీర్పుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అర్హత వేటు ఖాయమని అన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కా అని జోస్యం చెప్పారు. రూ.వందల కోట్లతో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనగోలు చేసిందని ధ్వజమెత్తారు. ఇక అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నాయకులను అవమానపరిచేలా దుర్భాషలాడిన దానం నాగేందర్‌ను ఉప ఎన్నికల్లో ఓడించి తీరుతామని సవాల్ చేశారు.

Read More: ఉప ఎన్నిక‌లు రావ‌డం త‌థ్యం.. హైకోర్డు తీర్పును స్వాగ‌తిస్తున్నాం : ఎక్స్‌లో హరీష్ రావు జోస్యం

Advertisement

Next Story

Most Viewed