- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పై విమర్శలు కాదు.. ఆ అన్యాయంపై కేసీఆర్‌ను ప్రశ్నించు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. దళిత సంక్షేమం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నే జరిగిందన్నారు.కేసీఆర్ సర్కర్ దళితులకు ఎన్ని ఇల్లు కట్టారు ..? అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్ళో తాము ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్న ఊళ్ళో కేసీఆర్ ఓటు అడగాలి.. అని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. దళితులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు.దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేశారా? దళిత బంధు అర్హులైన లబ్ది దారులకు అందించలేని అసమర్థ ప్రభుత్వం టిఆర్ఎస్ అని విమర్శించారు.
దళిత బందు లబ్దిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తారో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదని ప్రశ్నించారు. గత మూడేళ్లలో ఎంతమందికి దళిత,బీసీ,మైనార్టీ బందులు ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలన్నారు. కేసీఆర్ పాలన మొదటి 4 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేశారన్నారు. ఆఖరు సంవత్సరం ప్రజల కోసమంటూ ఎన్నికల ముందు హడావుడి చేస్తూ మోసం చేసేందుకు రెడీ అయ్యారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. దళితులకు పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పెంచుతా అంటే బీఆర్ఎస్ ఉలిక్కి పడుతుందన్నారు.