‘‘నీ అబద్ధాలు ఇక సాలు.. నీ పాలనకు ఇక సెలవు’’

by Satheesh |
‘‘నీ అబద్ధాలు ఇక సాలు.. నీ పాలనకు ఇక సెలవు’’
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో త్వరలో ఎన్నికలు వస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల చిట్టా విప్పి మరీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి విరుచుకుపడ్డారు. 24 గంటల కరెంట్, ఉచిత ఎరువులు, రైతు బీమా, కోటి ఎకరాల మాగాణం, చివరి ఆయకట్టుకు కాళేశ్వరం జలం అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన హామీలన్నీ అబద్ధాలేనని విమర్శించారు. ‘నీ అబద్ధాలు ఇక సాలు.. నీ పాలనకు ఇక సెలవు’ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed