- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Munugode by-poll: రేవంత్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోమవారం ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో గాంధీ భవన్‌లో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి తాను మునుగోడు ప్రచారానికి వెళ్లబోనని తాను హోంగార్డు లాంటి వాడినని అన్నారు. మునుగోడుకు ఎస్పీ రేంజ్ లాంటి వాళ్లే వెళతారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనపై వంద కేసులు పెట్టిన ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ఓ వ్యక్తి చెబుతున్నాడని ఆయనే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అన్నారు.
మునుగోడు ప్రచారానికి వెంకట్ రెడ్డి రాకపోతే కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరుగుతుంది కదా అని మీడియా ప్రశ్నించగా తనపై వంద కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ఓ నాయకుడు చెప్పాడని మునుగోడులో పార్టీని ఆయనే గెలిపిస్తారని ఇక తమతో పని లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. చాలా రోజుల అనంతరం ఇవాళ గాంధీ భవన్‌కు వచ్చిన వెంకట్ రెడ్డి ఇక తమతో పార్టీకి పని లేదని, అంతా ఎస్పీ రేంజ్ స్థాయి వ్యక్తినే చూసుకుంటారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వెంకట్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనేది తెరపైకి వస్తోంది. ఇక తాను ఎప్పుడు విదేశాలకు వెళ్తానో అనేది మంత్రి కేటీఆర్ కే తెలుసని అన్నారు. కడియం శ్రీహరికి తనను విమర్శించే స్థాయి లేదని ఫైర్ అయ్యారు. కాగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఫేవర్ చేయడానికే వెంకట్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని హస్తం పార్టీలోని మరో వర్గం ఆరోపిస్తోంది.