Komati Reddy: విద్యుత్ చార్జీల పెంపు అంశంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-10-22 09:33:51.0  )
Komati Reddy: విద్యుత్ చార్జీల పెంపు అంశంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిన్న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వద్దకు వెళ్లడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం విమర్శించారు. విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. రూ.49 కోట్లతో అసెంబ్లీని పునర్నిర్మిస్తామని, పార్లమెట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రెండు ఒకే దగ్గర ఉంటే టైమ్ సేవ్ అవుతుందన్నారు.

Advertisement

Next Story