- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంపై ఆ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంగళవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా రేవంత్ ఎంపిక కావడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రంగా కృషి చేశాడని కొనియాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని చెప్పారు. రేవంత్ సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Next Story