ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీకి కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్.. పొత్తులపై ఏం తేల్చబోతున్నారు..?

by Satheesh |   ( Updated:2023-10-25 09:58:48.0  )
ఒకే ఫ్లైట్‌లో ఢిల్లీకి కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్.. పొత్తులపై ఏం తేల్చబోతున్నారు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అభ్యర్థుల రెండో జాబితాపై పార్టీలు దృష్టి సారించగా.. మరోవైపు బీజేపీకి చెందిన ముఖ్య నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో హస్తినాకు బయలుదేరిన నేతలు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఇరు పార్టీల మధ్య పొత్తుల అంశంపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేన 32 స్థానాల్లో పోటీకి చేస్తామని ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో ఓ దఫా కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి బయలుదేరిన కిషన్ రెడ్డి, పవన్‌ జాతీయ నాయకత్వం వద్దే పొత్తులు, ఎన్నికల్లో పరస్పర సహకారం, సీట్ల పంపకాలు వంటి అంశాలపై చర్చించి ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story