ROR Act : ఈ భూమాత మరో ధరణి కారాదు..

by Sumithra |
ROR Act : ఈ భూమాత మరో ధరణి కారాదు..
X

దిశ, ఖమ్మం టౌన్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ, సమస్యల సాధనకు ధరణి పోర్టల్ ప్రవేశ పెట్టగా అది అస్తవ్యస్తంగా తయారైందని, దీని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా 2024 ( భూమాత )ను తీసుకొచ్చిందని, దీని పై సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారని, హైకోర్టు అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ అలీ పేర్కొన్నారు. శనివారం హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు . మొత్తం 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలన చేసి ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించారని అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం చేపడతామని, ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుత కొత్త ముసాయిదా చట్టంలో సుమారు నాలుగు నుంచి ఐదు మార్పులు చేర్పుల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.

ముఖ్యంగా కాస్తు దారుడు పేరు గల కాలంను కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా దరఖాస్తుదారులకు ఆన్లైన్ తోపాటు ఆఫ్ లైన్ విధానానికి కూడా అవకాశం కల్పించాలన్నారు. అలాగే అప్పీలు అధికారిగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి, రిటైర్డ్ న్యాయమూర్తి, సభ్యులుగా రెవెన్యూ ఉద్యోగులను, రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్ లో రిటైర్డ్ జడ్జిని అధికారిగా నియమించాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి విధించిన మూడు నెలల సమయంతో పాటు నాలుగు వాయిదాలు పెట్టడంతో పాటు ఆ పరిష్కారానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయవాది షేక్ నజిమా అద్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు శీలం పాపారావు, కేవీ. కృష్ణారావు, న్యాయ వాదులు వంజాకు లక్ష్మీనారాయణ, లతీఫ్, పాటిబండ్ల సంజయ్, కె.మన్మధ రావు, ఉదయ భాస్కర్, ఎన్.వేంకటేశ్వర్లు, వీరన్న నాయక్, వివిధ సంఘాల నాయకులు బాణోతు బద్రు నాయక్, షేక్ అబ్దుల్ రెహమాన్, పుల్లూరి నాగయ్య, భుఖ్య ఉపేంద్ర బాయి, గరిడేపల్లి సత్యనారాయణ, దేవుళ్ళ నాగేశ్వరావు, రవీంద్ర నాయక్, బోడా వీరన్న, స్పందన, జ్యోతి, పార్వతి, శ్రీను, భుక్యా కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Next Story

Most Viewed