అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామి తెలంగాణ

by Sridhar Babu |   ( Updated:2023-11-21 16:45:40.0  )
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామి తెలంగాణ
X

దిశ, వేంసూరు : ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని హైటిరో సంస్థల అధినేత, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి అన్నారు. వేంసూరు మండల పరిధిలోని కల్లూరుగూడెం, గూడూరు తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి అభిమానించే

వ్యక్తి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈయన కృషితో సత్తుపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న పలువురు నాయకులకు , కార్యకర్తలకు పార్టీ కండవా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు మారోజు సుమలత, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మిరియాల ప్రసాదు, కంటే వెంకటేశ్వరరావు, పలువురు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story